షార్జాలో ట్రాఫిక్‌ ఇబ్బందులు

- February 18, 2016 , by Maagulf
షార్జాలో ట్రాఫిక్‌ ఇబ్బందులు

దుబాయ్‌ నుంచి షార్జాకి వెళ్ళే రహదార్లపై ప్రయాణీకులు తీవ్ర అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భారీ వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడమే దీనికి కారణం. పోలీసు అధికారులు రోడ్లపై ట్రాఫిక్‌ని కంట్రోల్‌ చేయడంలో తీవ్రంగా శ్రమించవలసి వస్తుంది. అల్‌ వహ్దా ప్రాంతం వర్షాలకు భారీగా ఎఫెక్ట్‌ అయ్యింది. ఇక్కడ ట్రాఫిక్‌ మూమెంట్‌ చాలా స్లోగా ఉంది. పోలీసులు, ముననిసిపల్‌ అథారిటీ సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అత్యవసర పనుల నిమిత్తం వెళ్ళేవారు గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. వాహనాలు ఉన్నవారు కూడా వాటిని పక్కన పడేసి నడుచుకుంటూ వెళుతున్నారంటే రోడ్లపై ట్రాఫిక్‌ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గంటల తరబడి వాహనాలు రోడ్లపైనుంచి కదల్లేని పరిస్థితి ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com