భారత్‌తో మరింత మెరుగైన సంబంధాల కోసం బహ్రెయిన్ యత్నం
- November 25, 2020
మనామా:భారతదేశంతో ద్వైపాక్షిక బంధం మరింత అద్భుతంగా వుండేందుకోసం బహ్రెయిన్ ప్రయత్నాలు కొనసాగుతూనే వుంటాయని ఫారిన్ మినిస్టర్ డాక్టర్ అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జయాని చెప్పారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రమణ్యం జైశంకర్‌తో భేటీ సందర్భంగా అల్ జయానీ ఈ వ్యాఖ్యలు చేశారు. పరస్పర గౌరవం, సహకారంతో ఇరు దేశాలూ స్నేహభావంతో ముందడుగు వేస్తున్నాయనీ, ఆయా విభాగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నాయని డాక్టర్ అల్ జయాని చెప్పారు. కింగ్డమ్లో భారత కమ్యూనిటీ పాత్రని కొనియాడారాయన. మినిస్టర్ జై శంకర్, ఇటీవల మృతి చెందిన ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫాకి నివాళులర్పించారు. భారత్‌తో సన్నిహిత సంబంధాల విషయంలో బహ్రెయిన్ నాయకత్వం చేస్తున్న కృషిని కొనియాడారు జై శంకర్.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్‌వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







