‘జగనన్న తోడు’ పథకాన్ని ప్రారంభించిన ఏపి సిఎం
- November 25, 2020
అమరావతి: ఏపి సిఎం జగన్ ‘జగనన్న తోడు’ పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో చిరు వ్యాపారుల కష్టాలను చూశానని చెప్పారు. అసంఘటిత రంగంలో ఉన్న వారికి బ్యాంకు రుణాలు కూడా అందడం లేదని అన్నారు. చిరు వ్యాపారులకు అండగా ఉండేందుకు జగనన్న తోడు పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. చిరు వ్యాపారులకు స్మార్ట్ కార్డులను జారీ చేస్తామని చెప్పారు.
ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులకు బ్యాంకుల నుంచి రూ. 10 వేల రుణాన్ని అందించనున్నట్టు జగన్ తెలిపారు. బ్యాంకు అకౌంట్లు లేని వారికి అకౌంట్లను ప్రారంభిస్తామని చెప్పారు. ఐదు అడుగులు, అంతకన్నా తక్కువ స్థలంలో ఉన్న షాపులకు… తోపుడు బండ్లపైన, ఫుట్ పాత్ లపైన, గంపల్లో వస్తువులను పెట్టుకుని ఊరూరా తిరిగి అమ్ముకుని తిరిగే వ్యాపారులు ఈ పథకానికి అర్హులని తెలిపారు. గ్రామాల్లో నెలకు రూ. 10 వేలు, పట్టణాల్లో నెలకు రూ. 12 వేల ఆదాయం ఉండే వారు ఈ స్కీమ్ కు అర్హులని చెప్పారు. లబ్ధిదారులకు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డు ఉండాలని అన్నారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపి)
తాజా వార్తలు
- ఇరాన్ తీరుపై యూఏఈ ఫైర్.. ఉద్రిక్తతలు తగ్గించే ఆలోచన లేదా?
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్‌వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!







