చెన్నైలో భారీ వర్షాలు

- November 25, 2020 , by Maagulf
చెన్నైలో భారీ వర్షాలు

చెన్నై:నివర్‌ తుఫాను ప్రభావంతో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత కారణంగా చంబరపాకం రిజర్వాయర్‌ నిండటంతో... అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీజలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో.... ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 2015లో చంబరపాకం రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడంతో మహానగరం నీట మునిగింది. ఇప్పుడు మళ్లీ రిజర్వాయర్ నిండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com