కంపెనీ పీఆర్వోల ద్వారా పాస్‌పోర్ట్ అప్లికేషన్లను స్వీకరిస్తున్న ఇండియన్ ఎంబసీ
- November 25, 2020
అబుధాబి లోని ఇండియన్ ఎంబసీ, దరఖాస్తుదారులు లేకుండానే, ఆయా కంపెనీల పీఆర్వోల ద్వారా పాస్‌పోర్ట్ అప్లికేషన్లను స్వీకరించడం ప్రారంభించింది. ఈ మేరకు ఎంబసీ ఓ ప్రకటన చేసింది. కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కార్యక్రమం చేపడుతున్నారు. సీనియర్ మేనేజ్‌మెంట్, డైరెక్టర్స్ అలాగే సీఈఓలు, ఇతర ఉద్యోగులకు సంబంధించిన అప్లికేషన్లను తమ పీఆర్వోల ద్వారా సమీపంలోని బిఎల్‌ఎస్ సెంటర్, ఎంబసీలో అందించవచ్చు. అంతకు ముందు దరఖాస్తుదారులు, తమ పేపర్స్‌ని స్వయంగా అందించాలని ఎంబసీ కోరడం జరిగింది. అయితే, కరోనా నేపథ్యంలో ఈ విధానంలో మార్పులు చేశారు. ఈ విధానం ద్వారా అప్లికేషన్లను సమర్పించే దరఖాస్తుదారులకు సంబంధించి కొన్ని నిబంధనలు కూడా పొందుపరిచారు. ఎంప్లాయర్ లేదా కంపెనీ ఓ లెటర్‌ని ఎంబసీకి రాయాల్సి వుంటుంది సదరు పీఆర్వో విషయమై. ఉద్యోగి కూడా ఓ లేఖను పీఆర్వోకి ఇవ్వాల్సి వుంటుంది. పీఆర్వో, గుర్తింపు కోసం ఐడీ సహా సంబంధిత డాక్యుమెంట్లను బిఎల్‌ఎస్ సెంటర్లలో తగిన సొమ్ము చెల్లించి అందించవచ్చు. కొత్త మరియు పాత పాస్‌పోర్టులను స్వయంగా స్వీకరించడానికి లేదా కొరియర్ ద్వారా పొందడానికి తగిన ఆప్షన్‌ని కూడా ఎంచుకోవడానికి వీలుంది.
తాజా వార్తలు
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!







