ఉచిత కరోనా వ్యాక్సిన్ అందించనున్న కువైట్

- November 26, 2020 , by Maagulf
ఉచిత కరోనా వ్యాక్సిన్ అందించనున్న కువైట్

కువైట్: ప్రపంచం మొత్తం ఇప్పుడు ఎదురుచూస్తున్న అంశం 'కరోనా వ్యాక్సిన్'. మరి ఈ వ్యాక్సిన్ ను తమ దేశ పౌరులకే కాకుండా నివాసితులు సైతం ఉచితంగా అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది కువైట్. అయితే, ఈ వ్యాక్సిన్ పంపిణీ, లభ్యతకు లోబడి అంటుంది అని అధికారులు స్పష్టీకరించారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తయారీ కంపెనీలతో పలు ఒప్పందాలను కుదుర్చుకుంది కువైట్ ప్రభుత్వం.

కరోనాకు ఫైజర్ వ్యాక్సిన్ తో సహా పలు వ్యాక్సిన్ లతో ఒప్పందం కుదుర్చుకున్న కువైట్, వాటిని పొందేందుకు సన్నాహాలు చేస్తోంది. కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఒక మిలియన్ మోతాదుల 'ఫైజర్' వ్యాక్సిన్, ఒక మిలియన్ 700 వేల మోతాదుల 'మోడెర్నా' వ్యాక్సిన్, 3 మిలియన్ మోతాదుల "ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా" దిగుమతి కానున్నాయి. ఈ వ్యాక్సిన్లు ఈ ఏడాది డిసెంబర్ లో లేదా 2021 యొక్క మొదటి త్రైమాసికంలో కువైట్ చేరనున్నాయి.

అయితే, పౌరులు/నివాసితుల్లో వృద్దులు, ఆరోగ్య సమస్యలు గలవారు, దివ్యాంగులు, వైద్య సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది, మరియు ఫ్రంట్ ఎండ్ లో పనిచేసే కార్మికులకు ప్రాముఖ్యాత ఇవ్వడం జరుగుతుంది అని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com