రియాద్‌ నుంచి వచ్చిన ప్రయాణీకుల వద్ద దొరికిన 369.8 గ్రాముల బంగారం

- November 26, 2020 , by Maagulf
రియాద్‌ నుంచి వచ్చిన ప్రయాణీకుల వద్ద దొరికిన 369.8 గ్రాముల బంగారం

హైదరాబాద్ కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌కి చెందిన ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ అధికారులు ఇద్దరు ప్రయాణీకులపై గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులు నమోదు చేశారు. ఈ ఇద్దరూ రియాద్‌ నుంచి జి8 7000 నెంబర్‌ విమానంలో హైదరాబాద్ లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చారు. వీరి వద్ద నుంచి మూడు గోల్డ్‌ బార్స్‌ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన పాకెట్స్‌లో నిందితులు ఈ గోల్డ్‌ బార్స్‌ని వుంచి స్మగ్లింగ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో ప్రయాణీకుడు 184.9 గ్రాముల బంగారాన్ని స్మగుల్‌ చేశాడు. ఇద్దరి నుంచి 369.8 గ్రాముల బంగారం అధికారులకు దొరికింది. ఈ బంగారం విలువ 18,07,950 రూపాయలు వుంటుందని అంచనా వేశారు. కేసు విచారణ జరుగుతోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com