వరదల్లో వాహనంతో సహా ఓ కుటుంబం జలసమాధి
- February 18, 2016
యు.ఎ.ఇ.లో వర్షాలు ఏకధాటిగా కురవడంతో వాగులు వంకలు లోయల నుంచి వరదనీరు పొంగి పొర్లుతుంది. రెప్పపాటులోవిరుచుకుపడిన వరదలు ఓ కుటుంబంను వాహనంతో సహా జలసమాధి చేసింది.ఈ విషాదకర సంఘటన బుధవారం రస అల్ ఖమహ్ ప్రాంతంలో జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదంలో ఎమిరేట్స్ కు చెందిన ఒక తల్లి , ఆమె 11 ఏళ్ళ కుమార్తె , 3, 6 ఏళ్ళ వయస్సు ఉన్న ఇరువురు కుమారులు ఈ దుర్గటనలో మరణించారు. వీరు చనిపోయే ముందు వాహనంతో సహా ఎంతో దూరం కొట్టుకుపోయారు. కాగా వాహనం నడుపుతున్న కుటుంబ యజమానిని స్థానికులు రక్షించారు. ఈ వరద ప్రమాదంలో తల్లి , కుమార్తెల మృతదేహాలు బుధవారం లభ్యం అయ్యాయి. ఇరువురు చిన్నారుల శవాలును గురువారం ఉదయం కనుగొన్నారు. నది పరివాహక ప్రాంతం ఇసుకలో 500 మీటర్ల దూరం వాహనాన్ని నడుపుతుండగా, ఆ మార్గంలో అకస్మాత్తుగా వరద ఉదృతంగా ఎదురుగా రావడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొంటున్నారు. నిరంతరంగా కురుస్తున్న భారీవర్షాల కారణంగా లోయలు నిండిపోయి ఒక్కసారిగా నీరు విడుదల కాబడి దిగువ ప్రాంతానికి ప్రవహిస్తున్నాయి. జారిపోయే గుణమున్న ఇటువంటి ప్రదేశాలలో ప్రయాణాలు మంచిది కాదని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఈ ప్రమాదంలో స్థానికుల సహాయంతో రక్షింపబడిన కుటుంబ యజమాని ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు తెలుస్తుంది
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







