తెలంగాణలో కొత్తగా 761 కేసులు నమోదు
- November 27, 2020
హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంతో కొత్తగా 761 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 42,242 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించారు. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,67,665కి చేరింది. నిన్న నలుగురు వ్యక్తులు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఈ ఉదయం తాజా బులెటిన్ ను విడుదల చేసింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,448కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,839 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 53,32,150 కోవిడ్ పరీక్షలను నిర్వహించారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







