భారత్‌లో స్పుత్నిక్ టీకా ఉత్పత్తికి అంగీకరించిన రష్యా
- November 27, 2020
మాస్కో: కరోనా మహమ్మారి నియంత్రణ కోసం స్పుత్నిక్ -వీ టీకాను రష్యా తయారు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్‌ను ఇండియాలో కూడా ఉత్పత్తి చేసేందుకు రష్యా అంగీకారం తెలిపింది. భారత్‌కు చెందిన హెటిరో సంస్థ.. రష్యా ప్రభుత్వంతో కలిసి ఏడాదికి సుమారు 10 కోట్ల డోసులు తయారు చేసేందుకు అంగీకారం కుదుర్చుకున్నారు. స్పుత్నిక్- వీ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.
హెటిరో సంస్థతో పాటు రష్యన్ డైరక్టర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్)లు ప్రపంచవ్యాప్తంగా టీకాను పంపిణీ చేయనున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఇండియాలో స్పుత్నిక్- వీ టీకా ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు రష్యా తన ప్రకటనలో పేర్కొన్నది. ఇండియాలో ప్రస్తుతం స్పుత్నిక్ టీకాకు చెందిన రెండవ, మూడవ దశ ట్రయల్స్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చిలోగా ట్రయల్స్‌ను పూర్తి చేయనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ పేర్కొన్నది.
తాజా వార్తలు
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్‌తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్
- ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- అల్ హదీథా బార్డర్ వద్ద స్మగ్లింగ్ గుట్టురట్టు..!!
- యూఏఈలో ఫిబ్రవరి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- కువైట్-ఢిల్లీ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!







