హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘స్మార్ట్ ట్రాలీలు’

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘స్మార్ట్ ట్రాలీలు’
  • భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా GMR ఆధ్వర్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ (GHIAL), విమానాశ్రయ సేవలను, నిర్వహణను మరింత ఉన్నత దశకు తీసుకువెళుతూ ‘స్మార్ట్ బ్యాగేజ్ ట్రాలీ’లను ప్రారంభించింది. విమానాశ్రయాలలో రియల్ టైమ్‌లో ప్యాసింజర్ బ్యాగేజీ ట్రాలీల ట్రాకింగ్ మరియు నిర్వహణ కోసం ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం భారతదేశంలో ఇదే మొదటిసారి.    
  • విమానాశ్రయంలో బ్యాగేజ్ ట్రాలీల ప్రాజెక్టు కోసం LoRa (Long Range) IOT (Internet of Things) platform అన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టులో ఉన్న 3,000 బ్యాగేజ్ ట్రాలీలను IOT టెక్నాలజీతో అనుసంధానించారు. ఈ టెక్నాలజీ వల్ల ప్రయాణికులు బ్యాగేజ్ ట్రాలీల కోసం ఎదురు చూసే సమయం గణనీయంగా తగ్గిపోతుంది. రియల్ టైమ్‌లో తగినన్ని ట్రాలీలు ప్రయాణికులకు అందుబాటులో ఉంచడం వీలవుతుంది. ట్రాలీ మేనేజ్మెంట్, ఎయిర్‌పోర్టులో అవసరమైన చోటికి ట్రాలీలను తరలించడం వలన ప్రయాణికులు సౌకర్యవంతంగా ఉంటుంది.   

స్మార్ట్ ట్రాలీల అవసరం ఏమిటి?

ఎయిర్ పోర్టులో ట్రాలీ అవసరాలు చాలా వేగంగా మారుతుంటాయి. విమానాశ్రయంలో ప్రధానంగా రెండు చోట్ల ట్రాలీల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది – ఒకటి డిపార్చర్ ర్యాంప్ వద్ద, రెండోది అరైవల్స్ వద్ద ఉన్న బ్యాగేజ్ బెల్టుల వద్ద. IATA (అంతర్జాతీయ వాయు రవాణా సంస్థ) ప్రకారం, ఏ విమానాశ్రయంలోనైనా ప్రతి మిలియన్ ప్యాసింజర్లకు కనీసం 160 ట్రాలీలు అందుబాటులో ఉండాలి.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభిస్తున్న స్మార్ట్ ట్రాలీ మేనేజ్మెంట్ ద్వారా ట్రాలీలను అవసరమైన చోటికి, సరైన సమయంలో తరలించవచ్చు. ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల ట్రాలీలు విమానాశ్రయం సరిహద్దులను దాటే అవకాశాలను కూడా అడ్డుకోవచ్చు.   

ప్రయోజనాలు 

  • స్మార్ట్ ట్రాలీ మేనేజ్మెంట్ ద్వారా వచ్చీ పోయే ప్రయాణికుల సంఖ్యను ముందుగానే అంచనా వేసి, దానికి అనుగుణంగా బ్యాగేజ్ ట్రాలీలను అక్కడికి తరలించవచ్చు.
  • ఆపరేషన్ టీమ్‌లు విమానాశ్రయంలోని వివిధ ప్రాంతాలలో ముందస్తు ప్లానింగ్ ద్వారా రియల్ టైమ్ డాష్ బోర్డులు సమాచారాన్ని ప్రదర్శించి, ప్రయాణికులకు సరైన సమయంలో, సరైన ప్రదేశంలో వాటిని అందుబాటులోకి తీసుకురావచ్చు. ఈ విధానంలో లాప్‌టాప్‌లు, మొబైల్, డెస్క్ టాప్ లాంటి వాటి ద్వారా కూడా ట్రాలీలు ఎక్కడున్నాయన్న సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
  •  అంతర్గత అలర్ట్ మెకానిజం ద్వారా ఎవరైనా ట్రాలీలను ‘‘నో ఎయిర్ పోర్ట్ జోన్’’లోనికి తీసుకుపోతే వెంటనే అలర్ట్ మెసేజ్ వచ్చేలా ఏర్పాటు దీని వల్ల వెంటనే ట్రాలీలు ఎక్కడున్నాయో గుర్తించి, అవి ఎయిర్ పోర్టు పరిసరాలు దాటి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.

దీనిపై ఎస్‌జీకే కిషోర్, ఈడీ-సౌత్ మరియు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్, జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్, "ఆవిష్కరణ, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎప్పుడూ ముందుంటుంది. విమానాశ్రయ సేవలు, కార్యాచరణ నైపుణ్యాన్ని పెంచడానికి మేము అనేక వినూత్న డిజిటల్ పరిష్కారాలను కనుగొంటున్నాము. దేశీయ, అంతర్జాతీయ ఇ-బోర్డింగ్; ఫేస్ రికగ్నిషన్ ట్రయల్స్ వంటి విజయవంతమైన ప్రాజెక్టుల తరువాత, ప్రయాణీకుల అనుభవాన్ని పెంచడానికి, విమానాశ్రయ కార్యకలాపాలు నిరాటంకంగా సాగటానికి బ్యాగేజీ ట్రాలీల నిర్వహణ విధానంలో విప్లవాత్మక మార్పులు చేస్తున్నాము.’’ అన్నారు. 

 

 

 

Back to Top