ప్రధాని మోదీ...కొత్త షెడ్యూల్ ఇదే
- November 27, 2020
హైదరాబాద్:ప్రధాని మోదీ రేపటి హైదరాబాద్ టూర్ సమయం మారింది. రేపు సాయంత్రం హైదరాబాద్ కు రావాల్సిన ప్రధాని.. ఒంటిగంటకు నగరానికి చేరుకోనున్నారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి హకీంపేట్ ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటారు ప్రధాని మోదీ. అనంతరం భారత్ బయోటెక్ చేరుకుంటారు. తిరిగి 3 గంటలకి హకీంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి బయల్దేరుతారు. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రాంగణం ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ దాదాపు గంట సేపు గడిపే మోదీ... కరోనా వ్యాక్సీన్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకుంటారు. కార్యక్రమం పూర్తయ్యాక నేరుగా ఢిల్లీ వెళ్లిపోతారు.
గ్రేటర్ ఎన్నికలతో కానీ, ప్రచారంతో కానీ మోదీకి సంబంధం లేకపోయినా... హైదరాబాద్‌లో ఆయన పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. సాధారణంగా ప్రధానికి సంబంధించిన ఏ పర్యటన అయినా.. రెండువారాల ముందు ఖరావుతుంది. కానీ, ఈ టూర్ ఆకస్మికంగా ఖరారైంది. దీంతో, మోదీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. కేసీఆర్ సభతో ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్న టీఆర్‌ఎస్ కు కౌంటర్ గానే. ప్రధాని పర్యటనను బీజేపీ ప్లాన్ చేసి ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. బిజెపి అగ్రనాయకత్వం మొత్తం గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండగా ఇప్పుడు ప్రధాని పర్యటన ఆసక్తిగా మారింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు