దుబాయ్: నూన్.కమ్ ఎల్లో ఫ్రైడే సేల్స్ షారూఖ్ ప్రమోషన్

దుబాయ్: నూన్.కమ్ ఎల్లో ఫ్రైడే సేల్స్ షారూఖ్ ప్రమోషన్

దుబాయ్: ఆన్ లైన్ మార్కెటింగ్ సంస్థ నూన్.కమ్ వినియోగదారుల కోసం తీసుకొచ్చిన ఎల్లో ఫ్రైడే సేల్స్ బాలీవుడ్ బాద్ షా నుంచి మద్దతు లభించింది. ఎల్లో ఫ్రైడే థీమ్ కస్టమర్స్ కు రీచ్ అయ్యేలా స్పెషల్ మెసేజ్ తో హీరో షారూఖ్ ఖాన్ ప్రమోషన్ వీడియోను షేర్ చేశారు. ఎల్లో ఫ్రైడే సేల్స్ శుక్రవారం మధ్య రాత్రి నుంచి ప్రారంభమై ఈ నెల 29న ముగుస్తుంది. ఆఫర్ లో భాగంగా అన్ని వస్తులవుపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది నూన్.కమ్. దాదాపు అన్ని రకాల ఉత్పత్తులపై వినియోగదారులు 70 శాతం వరకు తగ్గింపు ఆఫర్లను పొందవచ్చని తెలిపింది. టోటల్ బిల్ పై కూడా డిస్కౌంట్ లభించనుంది. ఇక సౌదీలోని అల్ రజ్హి బ్యాంక్, యూఏఈ, ఈజిప్ట్ వీసాలపై కూడా 15 శాతం, మష్రెక్ నూన్ వీఐపీ క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ ఆపర్లు ప్రకటించింది. వినియోగదారులకు తక్కువ ధరలోనే రకరకాల వస్తువలను ఎల్లో ఫ్రైడే సేల్స్ ద్వారా అందించబోతున్నామని వెల్లడించిన నూన్.కమ్...తమ యాప్ ను ప్రతీ వ్యక్తీ దగ్గరికి తీసుకెళ్లటం తమ లక్ష్యమని వివరించింది. అలాగే స్థానిక వ్యాపారులకు నూన్.కమ్ ఓ మంచి ఫ్లాట్ ఫామ్ అని...వినియోగదారులతో పాటు స్థానిక అమ్మకందారులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించాలని కోరింది. 

 

Back to Top