ఖతార్ లో కోవిడ్ రూల్స్ బ్రేక్..ఫేస్ మాస్క్ ధరించని 112 మంది అరెస్ట్
- November 28, 2020
దోహా:ఖతార్ లో కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఫేస్ మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన 112 మందిని అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి న్యాయవిచారణకు కేసును బదిలీ చేశారు. అలాగే వాహనంలో నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువ మంది ప్రయాణిస్తున్న కేసులో మరో పది మందిని అదుపులోకి తీసుకున్నారు. కోవిడ్ నియంత్రణ కోసం ఖతార్ ప్రభుత్వం ఒక వాహనంలో డ్రైవర్ తో సహా నలుగురికి మించి ప్రయాణించొద్దని హెచ్చరించిన విషయం తెలిసిందే. మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు ప్రభుత్వం సూచించిన నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కెసిఆర్ కు సిట్ ఇచ్చిన నోటీసులు చెల్లవు: BRS లాయర్
- భక్తులకు టీటీడీ అలర్ట్: మార్చి 3న ఆలయం మూసివేత
- పీటీ ఉషా భర్త శ్రీనివాసన్ కన్నుమూత
- తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన
- డబ్డూబ్ వరల్డ్..2.5 KD ప్లే జోన్ ఆఫర్..!!
- ఫేక్ వర్క్ పర్మిట్లు.. ఎనిమిది మందికి శిక్షలు ఖరారు..!!
- ఒమన్ లో ఆర్కియాలజీపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్..!!
- సౌదీ అరేబియా జీడీపీ 4.8% వృద్ధి..!!
- జెబెల్ జైస్ జనవరి 31న రీ ఓపెన్..!!
- మెట్రోలింక్ సేవలను అప్డేట్ చేసిన దోహా మెట్రో..!!







