దేశంలోకి ఎంట్రీకి కొత్త మార్గనిర్దేశకాలను ప్రకటించనున్న కువైట్
- November 28, 2020
కువైట్ సిటీ:కరోనా వ్యాక్సిన్ తగినంతగా అందుబాటులోకి రాగానే దేశంలోకి ఎంట్రీ ఇచ్చే పౌరులు, ప్రవాసీయులకు కొత్త మార్గనిర్దేశకాలను సూచించేందుకు కువైట్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కువైట్ నిషేధిత జాబితాలో ఉన్న 34 దేశాల నుంచి కూడా ప్రయాణికులను అనుమతించేందుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో...ప్రభుత్వం ప్రకటించబోయే కొత్త నిబంధనలు నిషేదించిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను నియంత్రించేందుకు దోహదపడుతందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత...భారత్, పాకిస్తాన్ తో సహా 34 నిషేధిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు, ప్రవాసీయులు తాము కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నట్లు తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. లేదంటే పీసీఆర్ నెగటివ్ రిపోర్ట్ తో పాటు రెండు వారాలు క్వారంటైన్ లో ఉండేందుకు సుముఖతను చూపించాల్సి ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక కువైట్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే వారు ఆయా దేశాల నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించింది. ఇదిలాఉంటే కరోనా ప్రభావం ఎక్కువగా 34 దేశాల పట్ల కూడా గౌరవభావంతో ఉన్నామని, ఆయా దేశాల నుంచి విమాన రాకపోకలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తెలిపింది. అయితే..ప్రస్తుతం జాతీయ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంన్నందున ఆంక్షల సడలింపు కొన్ని రోజులు ఆలస్యం కానుందని వివరించింది. ఎన్నికల ఫలితాలు రాగానే కరోనా కమిటీ తగిన నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు