‘ఛలో ఢిల్లీ’ రైతు ఉద్యమంలో విషాధం…
- November 29, 2020
న్యూ ఢిల్లీ: భారత కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో విషాధం చోటు చేసుకుంది. పంజాబ్‌కు చెందిన జనక్ రాజ్(55) అనే రైతు కారులో నిద్రపోగా.. ఆ కారుకు నిప్పు అంటుకుని అతను సజీవ దహనం అయ్యాడు. కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న జనక్ రాజ్ రోజంతా రాత్రి సమయంలో అక్కడే ఉన్న కారులో నిద్రపోయాడు. అయితే కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన చుట్టుపక్కన వాళ్లు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ వీలుపడలేదు. దీంతో అతను కారులోనే సజీవదహనం అయ్యాడు. ఈ ఘటన కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతుల్లో పెను విషాధం నింపింది. మరోవైపు అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జనక్ రాజ్ స్వస్థలం పంజాబ్‌లోని బర్నాల జిల్లా ధనోలువా గ్రామం అని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికాలో మంచు తుఫాన్.. 29 మంది మృతి
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!
- గల్ఫ్‌ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!
- బహ్రెయిన్ ఓపెన్ టెన్నిస్ ఛాలెంజర్ ప్రారంభం..!!
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు







