యాదాద్రిలో గవర్నర్ దంపతులు
- March 13, 2026
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గురువారం కుటుంబ సభ్యులతో స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆలయానికి వచ్చిన ఆయనకు వేద పండితులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు ఆలయ సంప్రదాయంతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.గవర్నర్ ధ్వజస్తంభం వద్ద బలిపీఠానికి నమస్కరించుకొని స్వామి వారి అంతరాలయంలో అర్చనాది పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అర్చకులు స్వామి అమ్మవారి అష్టోత్తరంతో ప్రత్యేక పూజలు గావించి హారతిని ఇచ్చి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







