విజయవాడ లో గురునానక్ జయంతి వేడుకలు
- November 29, 2020విజయవాడ:గురునానక్ జయంతి సందర్బంగా నగరంలోని గురునానక్ కాలనీలోని గురుద్వార్‌లో జరుగుతున్న గురుపూరబ్ ఉత్సవాలలో జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ పాల్గొన్నారు.
ఆదివారం ఈ సందర్భంగా గురుద్వార్‌ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
విశిష్ట రోజుగా భావించే కార్తీక పౌర్ణమి రోజునే గురునానక్ పుట్టిన రోజు కావడం సిక్కులు పర్వదినం.గురునానక్ హిందు, ఇస్లామిక్ దివ్యగ్రంథాలను అధ్యయనం చేశారని కలెక్టర్ ఇంతియాజ్ చెప్పారు.
అదేవిధంగా గురుసింగ్ సహధర్మ ప్రచార్ కమిటీ ప్రతినిధులు ఆహ్వానం మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్రెడ్డి సోమవారం గురుద్వార్‌ను సందర్శించి ఉత్సవాలలో పాల్గొననున్నారని సీఎంవో నుంచి అందిన సమాచారంతో సీఎం రాక సందర్భంగా ఏర్పాట్లపై కమిటీ ప్రతినిధులతో చర్చించారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (సంక్షేమం)కె.మోహన్‌కుమార్, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ సభ్యులు ఎస్.హర్ మహీంద్ర సింగ్, వైయస్సార్సీపీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, బొప్పన భవకుమార్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అమరావతిలో చంద్రబాబును కలిసిన రామ్‌దేవ్
- టీటీడీ బోర్డు చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. పాలకమండలి కొత్త సభ్యులు వీరే..
- ఫుట్‌బాల్ ఆటగాళ్లకు క్షమాభిక్ష ప్రసాదించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్‌కు 4 రోజులపాటు విమాన సర్వీసులను రద్దు చేసిన ఎతిహాద్..!!
- చట్టవిరుద్ధమైన విక్రయాలు.. కార్లను తొలగించాలని నోటీసులు జారీ..!!
- కువైట్‌లోని కార్మికుల్లో అగ్రస్థానంలో భారతీయులు..!!
- మదీనాలో విమానం మెట్లపై నుంచి పడి మహిళా ప్యాసింజర్ మృతి..!!
- ఖతార్ లో మెరైన్ టూరిజం ట్రాన్స్ పోర్ట్ నిబంధనల్లో మార్పులు..!!
- రేపు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
- 500 ఏళ్ల తర్వాత అయోధ్య ఆలయంలో దీపావళి..