టీకా వేయించుకున్న కిమ్ జాంగ్ ఉన్!
- December 01, 2020
ఉత్తరకొరియా: కరోనా ప్రపంచాన్ని చుట్టుముట్టగానే, తన దేశపు సరిహద్దులను దిగ్బంధించి, బయటి నుంచి ఒక్కరిని కూడా రానీయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న కిమ్ జాంగ్ ఉన్, చైనాలో తయారైన ఓ టీకాను తీసుకున్నారట. ఈ విషయాన్ని వాషింగ్టన్ కేంద్రంగా నడుస్తున్న సెంటర్ ఫర్ నేషనల్ ఇంట్రెస్ట్ సంస్థ ప్రతినిధి హారీ కజియానిస్ వెల్లడించారు. ఉత్తర కొరియా వ్యవహారాలను అనునిత్యమూ పరిశీలిస్తుండే ఆయన, కిమ్ కుటుంబీకులు, ముఖ్యమైన అధికారులు కూడా వ్యాక్సిన్ ను వేయించుకున్నారని చెప్పడం గమనార్హం. కాగా, చైనాలో పలు రకాల టీకాలు అభివృద్ధి దశలో ఉండగా, కిమ్ ఏది వాడారన్న విషయాన్ని మాత్రం ఆయన పేర్కొనలేదు. ఇంతవరకూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సహా, ఇతర నియంత్రణా సంస్థలేవీ ఏ టీకానూ ఆమోదించ లేదన్న సంగతి తెలిసిందే.
ఇక చైనా ప్రజలతో నేరుగా వ్యాపారాలు నిర్వహించే ఉత్తర కొరియాలో ఒక్క కేసు కూడా ఇంతవరకూ రాకపోవడాన్ని యూఎస్ నిఘా సంస్థలు తోసిపుచ్చుతున్నాయి. అయితే, కరోనా వచ్చిన కొత్తల్లో హోమ్ క్వారంటైన్ లో ఉండాలని చెబితే వినలేదన్న కారణంతో ఓ వ్యక్తిని కాల్చి చంపినట్టు వార్తలు వచ్చాయి. ఆ తరువాత కొరియా హ్యాకింగ్ ముఠాలు టీకాపై ఇన్ఫర్మేషన్ కోసం సైబర్ దాడులకు దిగాయని మైక్రోసాఫ్ట్ ఆరోపించింది కూడా. హ్యాకర్ల బారిన ఆస్ట్రాజెనికా కూడా పడిందని కొన్ని కథనాలు వచ్చాయి.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







