హైదరాబాద్:ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు, రాజకీయ నాయకులు..

- December 01, 2020 , by Maagulf
హైదరాబాద్:ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు, రాజకీయ నాయకులు..

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. బల్దియా పోరులో 150 డివిజన్లకు గాను 1,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గ్రేటర్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 74 లక్షల 67వేల 256 మంది. ఇక పోలింగ్ కోసం జంటనగరాల పరిధిలో 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.

ఓటింగ్ కోసం మొత్తం 18,202 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. పలు కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ కు ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ విధుల్లో 36మందికిపైగా సిబ్బంది ఉన్నారు. టీఆర్‌ఎస్‌-150, బీజేపీ-149, కాంగ్రెస్‌-146 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఇక టీడీపీ-106, ఎంఐఎం-51 స్థానాల్లో అభ్యర్థులను నిలిపాయి. సీపీఐ-17, సీపీఎం-12, ఇతర పార్టీలు-76, స్వతంత్రులు-415 మంది పోటీలో ఉన్నారు. కరోనా నేపథ్యంలో  పోలింగ్ కేంద్రాల వద్ద కొవిడ్‌ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఆయా కేంద్రాల్లో మార్కింగ్‌ వేశారు. కాగా, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com