హీరో నాగశౌర్య, సంతోష్ జాగర్లపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం `లక్ష్య`
- December 01, 2020
హైదరాబాద్:యంగ్ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే..ఈ చిత్రానికి `లక్ష్య` అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తూ ఈ రోజు సాయంత్రం 5:04 నిమిషాలకు స్పెషల్ పోస్టర్‌ని విడుదలచేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌లో నాగశౌర్య లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో విలక్షణ నటుడు జగపతి బాబు నటిస్తున్నారు.
నాగశౌర్య కెరీర్‌లో 20వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలచేసిన స్టన్నింగ్ ఫస్ట్‌లుక్ అందరినీ థ్రిల్ చేసింది. `ది గేమ్ విల్ నెవర్ బీ ద సేమ్’ అంటూ ఎయిట్ ప్యాక్ బాడీతో చేతిలో బాణం పట్టుకుని వారియర్ పోజ్ లో నాగశౌర్య నిల్చొని ఉన్న లుక్ సూపర్బ్ అని అందరూ అప్రిషియేట్ చేశారు. ప్రాచీన విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని కమర్షియల్ హంగులతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
యంగ్ హీరో నాగశౌర్య, కేతికశర్మ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: రామ్‌రెడ్డి, సంగీతం: కాలబైరవ, ఎడిటర్: జునైద్, నిర్మాతలు: నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్ మరార్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి.
తాజా వార్తలు
- కువైట్‌లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!
- అంగోలాకు చేరుకున్న ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్..!!
- సౌదీలో ఎక్స్‌పాట్ డాక్టర్‌పై విచారణ..!!
- యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- ఖతార్‌లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్‌లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్‌లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం







