బహ్రెయిన్: పిసిఆర్ టెస్ట్ ధర తగ్గింపు
- December 01, 2020
మనామా:నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ - కరోనా వైరస్ (కోవిడ్ 19) వెల్లడించిన వివరాల ప్రకారం పీసీఆర్ టెస్టుల ధర 60 బహ్రెయినీ దినార్స్ నుంచి 40 బహ్రెయినీ దినార్స్‌కి దిగి వచ్చింది. ఈ 40 బహ్రెయినీ దినార్స్‌లో పీసీఆర్ అరైవల్ టెస్ట్ అలాగే, వచ్చిన తర్వాత 10 రోజులకు చేసే టెస్ట్ కూడా కలిసి వుంటుంది. 'వివేర్ బహ్రెయిన్' అప్లికేషన్‌ని అరైవల్స్ అందరూ ఉపయోగించాల్సి వుంటుంది. టెస్టుల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. సంబంధిత డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సి వుంటుంది. దేశంలోకి వచ్చిన తర్వాత పది రోజులకు చేసే పరీక్షలో పాజిటివ్ వస్తే, ఆయా వ్యక్తులతో హెల్త్ మినిస్ట్రీ ప్రత్యక్షంగా సంప్రదింపులు జరుపుతుంది. డిసెంబర్ 1 నుంచి తగ్గించిన పీసీఆర్ టెస్ట్ ధరలు అమల్లోకి వచ్చాయి.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!