2 మిలియన్ల నకిలీ వస్తువులను ధ్వంసం చేసిన సౌదీ అరేబియా
- December 03, 2020
రియాద్:బ్రాండెడ్ వస్తువులకు నకిలీగా తయారు చేసిన దాదాపు 20 లక్షల వస్తు సామాగ్రిని సౌదీ అరేబియా అధికారులు ధ్వంసం చేశారు. అసలు గూడ్స్ ప్రయోజనాలను, మార్కెట్ ను దెబ్బతీసేలా..వినియోగదారుల ప్రయోజనాలకు భంగం కలిగించే ఎలాంటి చర్యలను ఉపేక్షించబోమని అధికారులు వెల్లడించారు. విమానాలు, సముద్ర రవాణా ద్వారా కింగ్డమ్ పరిధిలోకి వచ్చిన నకిలీ వస్తువులను సౌదీ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని, స్వాధీనం చేసుకున్న నకిలీ వస్తువులను ధ్వంసం చేసే బాధ్యతను ప్రత్యేకంగా ఓ కంపెనీకి అప్పగించినట్లు తెలిపారు. ధ్వంసం చేసిన నకిలీ వస్తువుల్లో దుస్తులు, వాహనాల విడి భాగాలు, మొబైల్ యాక్సెసరీస్ ఉన్నాయని వివరించారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం