రాజకీయ ప్రవేశంపై రజనీకాంత్ ప్రకటన
- December 03, 2020
చెన్నై:తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది ఆయన రాజీకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు రజనీకాంత్ ట్విటర్ వేదికాగా ప్రకటించారు. జనవరిలో రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని, అందుకు సంబంధించిన వివరాలను డిసెంబరు 31న ప్రకటిస్తానని రజనీకాంత్ వెల్లడించారు.
కాగా, కిడ్నీ మార్పిడి వలన రజనీకాంత్ రాజకీయాలలోకి రాడని, ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తలైవా చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో తన పార్టీ రజనీ మక్కళ్ మండ్రం (ఆర్ఎంఎం) జిల్లా కార్యదర్శులతో సమావేశమై చర్చించారు. అనంతరం పోయెస్ గార్డెన్లోని తన నివాసం వెలుపల విలేకరులతో మాట్లాడారు. వాళ్ల (ఆర్ఎంఎం కార్యదర్శులుా) అభిప్రాయాలను వాళ్లు చెప్పారని, తన అభిప్రాయాన్ని తాను తెలియజేశానని రజినీ తెలిపారు. ‘నా నిర్ణయం ఏదైనా సరే నా వెంటే ఉంటానని వాళ్లు చెప్పారు. నా నిర్ణయాన్ని వీలైనంత త్వరగా వెల్లడిస్తాన’ని చెప్పారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష