మలేషియా లో కరీంనగర్ జిల్లా వాసి మృతి

మలేషియా లో కరీంనగర్ జిల్లా వాసి మృతి

కౌలా లంపూర్ :కరీంనగర్  జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరి గ్రామానికి చెందిన కోరేపు ఎల్లయ్య  ఇటీవల మలేషియా జోహార్బారు లోని షాఆలం  హాస్పిటల్లో  న్యూమోనియా తో 14th నవంబర్ న మృతిచెందాడు. ఈ విషయం మృతిని బంధువులు మరియు భార్య కోరేపు జ్యోతి మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైట) కి తెలియజేసారు.  

ఈ విషయం తెలిసిన వెంటనే  మైట ప్రెసిడెంట్ సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ సత్య  మైగ్రేట్ వింగ్ హెడ్ ప్రతీక్ యూత్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్  మలేషియా లోని ఇండియన్ ఎంబసీ తో ఆసుపత్రి తో  మరియు వారి బంధువులతో సంప్రదింపులు జరిపి మృతదేహాన్ని రేపు  04/12/2020 రోజున వందే భరత్ మిషన్ లో భాగమైన ఎయిర్ ఇండియా ఎక్సప్రెస్ IX 1921  ప్రత్యేక విమానం లో హైదరాబాద్ శంషాబాద్ ఏర్పోర్ట్ కు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేసారు అలాగే తెలంగాణ ప్రభుత్వం  విమానాశ్రయం నుండి వారి గ్రామానికి  అంబులెన్సు సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నది. దీనికి సహకరించిన NRI సెల్ చిట్టి బాబు కి మైట తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు

హాస్పిటల్ లో  కోరేపు ఎల్లయ్య ట్రీట్మెంట్ కి సంబంధించిన ఖర్చు మొత్తాన్ని దాదాపు 50 వేయిల రూపాయలు మలేషియా తెలంగాణ అసోసియేషన్ భరించింది  అలాగే   మైట  విన్నపం మేరకు ఈ మృత దేహాన్ని హైదరాబాద్ పంపడానికి ఆయన మొత్తం ఖర్చు దాదాపు 1.5లక్షలా రూపాయలను మలేషియా లోని ఇండియన్ ఎంబసీ పూర్తిగా భరించిందని మైట వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి తెలియజేసారు. 

అలాగే దీనికి సహకరించిన కోర్ కమిటీ సబ్యులకు మరియు మైట సబ్యులకు ప్రెసిడెంట్ సైదం తిరుపతి  ప్రత్యేక  కృతజ్ఞతలు తెలియజేసారు. 

Back to Top