బిగ్ టికెట్ అబుధాబి: 12 మిలియన్ దిర్హాములు గెల్చుకున్న భారతీయుడు
- December 04, 2020
యూఏఈ:దుబాయ్‌కి చెందిన భారత వలసదారుడు 12 మిలియన్ దిర్హాముల బహుమతిని గెల్చుకున్నాడు బిగ్ టికెట్ డ్రా సందర్భంగా. అబుధాబిలో జరిగిన 222 సిరీస్ బిగ్ టికెట్ డ్రా, భారత వలసదారుడికి అత్యద్భుతమైన ఆనందాన్ని తీసుకొచ్చింది. 51 ఏళ్ళ జార్జి జాకబ్స్, మెడికల్ ఎక్విప్‌మెంట్ సేల్స్ పర్సన్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో వున్న జార్జికి ఈ బిగ్ టికెట్ డ్రాతో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి. దుబాయ్‌లో ఆయన తన భార్య, కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. నవంబర్ 30న జార్జి, 069402 టిక్కెట్‌ని కొనుగోలు చేశారు. గత రెండేళ్ళుగా ఆయన ఈ టిక్కెట్లను కొంటున్నారు. కాగా, గెలిచిన మొత్తాన్ని ఎవరితోనూ తాను పంచుకోబోనని జార్జి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







