బహ్రెయిన్‌ సెలూన్లలో పలు సేవల పునరుద్ధరణ

బహ్రెయిన్‌ సెలూన్లలో పలు సేవల పునరుద్ధరణ

మనామా:బహ్రెయిన్‌లో సెలూన్లు పలు సేవల్ని అదనంగా అందించేలా ఆదేశాలు జారీ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ వెల్లడించింది. కోవిడ్‌ 19 ప్రోటోకాల్స్‌ అనుసరిస్తూ, ఆయా సేవల్ని పునరుద్ధరించుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ సర్వీసుల వివరాల్లోకి వెళితే, ఫేసియల్‌ ట్రీట్‌మెంట్స్‌, హెయిర్‌ ట్రీట్‌మెంట్స్‌, ఫేస్‌ థ్రెడింగ్‌ / హెయిర్‌ రిమూవల్‌, హెన్నా అప్లికేషన్‌, మేకప్‌ అప్లికేషన్‌, ఐలాష్‌ ఇన్‌స్టలేషన్‌, టానింగ్‌, హెయిర్‌ ఎక్స్‌టెన్షన్‌ వంటివి పునరుద్ధరించబడిన సెలూన్‌ సేవల్లో వున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యూటీ పార్లర్లు, సెలూన్లు కరోనా నిబందనల్ని పాటించాల్సిందేనని, ప్రికాషనరీ మెజర్స్‌ తప్పక పాటించాలనీ మినిస్ట్రీ హెచ్చరించింది.

Back to Top