షార్జాలో ప్రవాసాంధ్ర భరోసా భీమా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన APNRTS డైరెక్టర్ ఇలియాస్ బి.హెచ్.
- December 04, 2020
షార్జా:యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని షార్జా నగరంలో (UAE ) APNRTS కో-ఆర్డినేటర్ సోమిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశములో APNRTS డైరెక్టర్ ఇలియాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
కరోనా విపత్కర పరిస్ధితి సమయములో UAE లో ఉన్న తెలుగు వారు పనులు లేక జీతాలు రాక పట్టెడు అన్నం కొరకు అవస్ధలు పడుతున్న సమయములో మేమున్నాము అంటూ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అవస్ధలు పడుతున్న వారుండే చోటుకు పోయి వారికి నిత్యావసర సరుకులు అందించిన UAE APNRTS కో-ఆర్డినేటర్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అభినందనలు తెలుపుతూ APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్ మేడపాటి ఆదేశానుసారం ఇలియాస్ ప్రశంస పత్రాలను అందించడం జరిగింది.
ఈ సందర్భముగా ఇలియాస్ మాట్లాడుతూ... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కార మార్గంగా ఉన్న వెంకట్ ఆధ్వర్యంలో APNRTS అనునిత్యం ప్రవాసాంధ్రుల సేవలో ఉందని తెలుపుతూ APNRTS ప్రవాసాంధ్రులకు, వారి కుటుంబాలకు ఆసరా ఉండేటట్లు ప్రవాసాంధ్ర భరోసా భీమా అందిస్తున్నారు. ఉద్యోగులైతే ౩ సంవత్సరాలకు గాను కేవలం 450 రూపాయలు, విద్యార్ధులైతే సంవత్సరానికి 180 రూపాయలతో ప్రవాసాంధ్ర భరోసా భీమాలో నమోదు చేసుకుంటే చాలు. ఏ సమయములో ఎలాంటి పరిస్ధితి ఉంటుందో తెలియదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు ప్రతి ఒక్కరు ప్రవాసాంధ్ర భరోసా బీమా చేసుకోవాలని మనవి చేశారు. ప్రమాదశాత్తు ఏదైనా ప్రమాదంలో మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా 10 లక్షల రూపాయలు భీమా రూపంలో లభిస్తుందని తెలిపారు.
సోమిరెడ్డి మాట్లాడుతూ... APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్ మేడపాటి , డైరెక్టర్ ఇలియాస్ వారివురు సూచనలు, సలహాలతో ప్రవాసాంధ్రుల సేవలో ఉన్నామని, కోవిడ్ సమయం లో చురుగ్గా పనిచేసిన సుమారు 23 మందిని ప్రశంసిస్తూ ప్రశంసా పత్రాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో APNRTS ద్వారా ఎన్నార్టీ సేవలో ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమములో కువైట్ యూత్ ఇంచార్జ్ మర్రి కళ్యాణ్, రెడ్డయ్య రెడ్డి , బ్రహ్మానంద రెడ్డి , శ్యామ్ సురేందర్ రెడ్డి , ముప్పాళ్ళ వెంకటేశ్వర్లు, సయ్యద్ నాసర్ వలి, చంద్ర శేఖర్ రెడ్డి , వెంకట రమణా రెడ్డి , సయ్యద్ అక్రమ్ భాషా, విజయ్ కుమార్ రెడ్డి, రంజిత్, వేణుగోపాల్ రెడ్డి సబ్బెళ్ల ,హర్ష వర్దన్ , కొటేశ్వర రెడ్డి , నాగ ప్రతాప్ రెడ్డి , తాజుద్దీన్, మహేశ్వర రెడ్డి , అంజాద్ , ప్రదీప్, గిరి , కామేష్ , నరసింహ రెడ్డి ( alias నరేష్), కర్ణ ,పవన్ ,సాయి చంద్ర , స్వప్న ,విజయ , సుధ , సునంద పాల్గొన్నారు. APNRTS UAE కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,షార్జా)


తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







