జయలలిత వర్థంతి సంధర్భంగా 'తలైవి' కొత్త స్టిల్స్ విడుదల

- December 05, 2020 , by Maagulf
జయలలిత వర్థంతి సంధర్భంగా \'తలైవి\' కొత్త స్టిల్స్ విడుదల

చెన్నై:జయలలిత ఈ పేరు తెలియని వారు ఉండరనే చెప్పుకోవాలి. తమిళ ప్రజతకు ఈమె దేవత. అమ్మా భోజనం అని ప్రతి బీదవాడికి ఒక్క రూపాయికే భోజనం అందించింది. ఇలాంటివి మరెన్నో సంక్షేమ పథకాలను తమిళ ప్రజలకు అందించింది. ఇంతటి గొప్ప నాయకురాలి కథను సినిమా చిత్రంచనున్నారు. అయితే కాంట్రవర్సీ క్వీన్ కంగనా ఇటీవల అనేక వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ముంబై ప్రభుత్వాన్ని విశ్లేషిందని ముంబై పోలీసులు ఆమెపై దేశద్రోహం కేసును నమోదు చేశారు. ఇటువంటివి మరెన్నో దాంతో వివాదాల రాణిగా కంగనా పేరు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం కంగానా తమిళనాడుకు వరుసగా ఆరుసార్లు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించిన జే జయలలిత జీవిత కథలో నటిస్తోంది. ఈ సినిమాలో కంగనా ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా ఎల్ అజయ్ దర్శకత్వంలో తెరకెక్కతోంది. ఇందులో ప్రకాష్ రాజ్, అరవింద్ స్వామీ మరి కొందరు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే నేడు జయలలిత వర్ధంతి సందర్భంగా కంగనా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో అచ్చం జయలలిత చీర కట్టులో కంగనా కనిపించింది. అయితే ఈ ఫొటోలతో పాటు జయమ్మ వర్థంతి సందర్భంగా మా సినిమా తలైవి సినిమా నుంచి కొన్ని ఫొటోలను మా టీమ్ పంచుకున్నారు. ఈ రెవుల్షనరీ సినిమాకు టీమ్ లీడర్ అజమ్ చాలా కష్టపడుతున్నారు. ఇంతటి గొప్ప నాయకుల కథ చేయడం సంతోషంగా ఉంది. ఇంక ఒక్క వారంమాత్రమే ఉందంటూ ట్వీట్ చేసింది. మరి ఈ సినిమాలో జయలలితగా కంగనా ఎంతవరకు మెప్పిస్తుందొ చూడాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com