ట్రేడింగ్ ఇన్వెస్ట్ మెంట్ పేర్లతో భారీ మోసం...

- December 05, 2020 , by Maagulf
ట్రేడింగ్ ఇన్వెస్ట్ మెంట్ పేర్లతో భారీ మోసం...

హైదరాబాద్:ప్రస్తుత కాలంలో ఆన్‌లైన్‌ మోసాలు, డబ్బుల కోసం ఛీటింగ్‌లు చేస్తున్నారు. స్మార్ట్‌ ఫోన్లు వచ్చినప్పటి నుంచి ఈ ఆన్‌లైన్‌ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా మరో ఘటన బయటపడింది. ట్రేడింగ్ ఇన్వెస్ట్ మెంట్ పేర్లతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.  కలకత్తా,  ఢిల్లీ,  హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన 850 మంది నుండి ఓ ఆన్ లైన్ ట్రేడింగ్ మోసగాడు ఏకంగా  34 కోట్లు వసూలు చేసాడు.  ఇన్వెస్ట్ మెంట్ పేరుతో భారీగా మోసాలకు పాల్పడ్డాడు.  ట్రేడింగ్ పేరుతో తనను మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలని... బేగంపేటకు చెందిన ఖయ్యూమ్ ఖాన్ అనే వ్యక్తి  హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు  3 నెలల క్రితం  ఫిర్యాదు చేసాడు. ఆ ఫిర్యాదు నిమిత్తం కేసు నమోదు చేసి... దర్యాప్తు ప్రారంభించారు సైబర్ పోలీసులు. మోసాలకు పాల్పడుతున్న సైనిక్ పూర్ కి చెందిన కౌశిక్ బెనర్జి, రేఖ జాదవ్,అనే ఇద్దరిని అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. అయితే.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com