ఫైజర్‌-బయోటెక్‌ కోవిడ్-19 ‌వ్యాక్సిన్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన బహ్రెయిన్

- December 05, 2020 , by Maagulf
ఫైజర్‌-బయోటెక్‌ కోవిడ్-19 ‌వ్యాక్సిన్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన బహ్రెయిన్

మనమా‌: ఫైజర్‌-బయోటెక్‌ కోవిడ్-19 ‍వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి ఆమోదించినట్లుగా బహ్రెయిన్‌ తెలిపింది. బ్రిటన్‌ తరువాత ఈ వ్యా‍క్సిన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన రెండవ దేశం ఇదే. వ్యాక్సిన్‌ ఆమోదంతో కోవిడ్‌-19 నియంత్రణకు మరింత బలం చేకూరుతుందని నేషనల్‌ హెల్త్‌ రెగ్యులేటరీ అథారిటీ సీఈవో మారియమ్‌ అల్‌ జలాహ్మా ఓ ప్రకటనలో తెలిపారు. అయితే యూఎస్‌ ఔషద దిగ్గజం ఫైజర్‌ ఇంకా జర్మన్‌ భాగస్వామి బయోటెక్‌ ఈ టీకాను ఎప్పుడు ప్రారంభిస్తాయో మనమా పేర్కొనలేదు. సాధారణ ఉపయోగం కోసం కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను ఆమోదించినట్లు, వచ్చేవారం నుంచి దీనిని ప్రారంభించాలని చూస్తున్నట్లు బ్రిటన్‌ బుధవారం తెలిపింది.

మరోవైపు నవంబర్‌లో బహ్రెయిన్‌.. చైనాకు చెందిన సినోఫార్మ్‌ వ్యాక్సిన్‌ను ఫ్రంట్‌లైన్‌ హెల్త్‌కేర్‌ వర్కర్స్‌పై ఉపయోగించడాన్ని ఆమోదించింది. 

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com