రూ 251 కే స్మార్ట్ ఫోన్ !
- February 18, 2016
ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ. అదే 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్. అమ్మకాలు మొదలెట్టగానే సర్వర్ లు క్రాష్ అయ్యేంత రష్. ఇంతలా భారీగా హైప్ క్రియేట్ చేసిన రింగింగ్ బెల్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మోహిత్ గోయల్ ప్రస్థానం మాత్రం అతిసాధారణంగా ఉంది. ఉత్తరప్రదేశ్ లోని షమ్లీ జిల్లాలో గర్హిపుక్త అనే చిన్న పట్టణంలో కిరాణా కొట్టు నిర్వహించే కుటుంబానికి చెందిన మోహిత్ గోయల్ ఎవరో నిన్నటి వరకు ఆపట్టణంలోని వారికే సరిగా తెలియదు. అయితే ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా చర్చంతా గోయల్ గురించే.పెద్ద పెద్ద వ్యాపార దిగ్గజాలకు సైతం సాధ్యం కాని ధరకు స్మార్ట్ ఫోన్ ను అందించేందుకు పూనుకున్న మోహిత్ గోయల్ తండ్రి రాజేష్ గోయల్ గర్హిపుక్తలో 'రామ్ జీ' పేరుతో చిన్న కిరాణం కొట్టును నడిపిస్తున్నాడు.మోహిత్ చిన్నతనంలో తండ్రికి కిరాణా దుకాణం నిర్వహణలో సహకరించేవాడు. గర్హిపుక్తలోనే ఓ కాన్వెంట్ పాఠశాలలో చదువు పూర్తి చేసిన మోహిత్.. నోయిడాలోని అమితి యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఇటీవల మోహిత్ గర్హిపుత్ర వెల్లినప్పుడు ఓ కంపెనీని ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పాడని, అయితే అప్పుడు అది ఇంతగా ప్రజల్లోకి వెళ్లేదని అనుకోలేదని అక్కడి వారు చెబుతున్నారు. బీజేపీ సీనియర్ లీడర్ మురళీ మనోహర్ జోషీ చేతుల మీదుగా జరిగిన ఫ్రీడమ్ 251 మొబైల్ ను లాంచ్ కార్యక్రమానికి మేం కూడా వెళ్లామని చెబుతూ కొందరు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







