రైలు ఢీకొట్టి నలుగురు ప్రాణాలు కోల్పోయారు...
- February 18, 2016
నలుగురు కాంట్రాక్టు రైల్వే ఉద్యోగుల కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. విధుల్లో నిమగ్నమై ఉన్న నలుగురు రైల్వే గ్యాంగ్ మెన్లను ఓ లోకల్ రైలు ఢీకొనడంతో వారు గాల్లోకి ఎగిరిపడి ప్రాణాలు కోల్పోయారు. ముంబయిలోని సబర్బన్ కుర్లా- విద్యావిహార్ స్టేషన్ల మధ్య శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. సరిగ్గా ఉదయం 6.15గంటల నుంచి 6.30 గంటల మధ్య ప్రాంతంలో ఇది చోటుచేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.ఘటనకు గల కారణాలపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం నలుగురు కాంట్రాక్టు రైల్వే గ్యాంగ్ మెన్ ఉద్యోగులు ఉదయాన్నే పనుల నిమిత్తం సబర్బన్ కుర్లా- విద్యావిహార్ స్టేషన్ల మధ్య పట్టాలపక్కన నడుస్తుండగా అనూహ్యంగా చత్రపతి శివాజీ టర్మనల్ కు చెందిన లోకల్ రైలు వారిని వెనుకనుంచి వేగంగా ఢీకొట్టింది.కొంచెం చీకటిగా ఉండటం వల్ల రైలు రాకను గుర్తించపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా వారు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. అంతకుముందు నవంబర్ 3, 2013లో కూడా నలుగురు గ్యాంగ్ మెన్ లు ఇలాగే ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







