దుబాయ్ లో నితిన్ 30వ సినిమా షూటింగ్ షురూ
- December 06, 2020
దుబాయ్:యూత్ స్టార్ నితిన్ హీరోగా మెర్లపాకా గాంధీ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ ఆదివారం నుంచి దుబాయ్ లో షూటింగ్ జరుగుతోంది. నితిన్- నభా నటేష్ జంటపై సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. నితిన్‌కి ఇది 30 వ సినిమా. ఈ మూవీ ప్రారంభోత్సవం గురించి నితిన్ స్వయంగా వెల్లడిస్తూ ఒక లైవ్ ఫోటోని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. బాలీవుడ్ లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘అంధాదున్’ సినిమాకి రీమేక్ ఇది.
నితిన్ షేర్ చేసిన ఫొటోలో ఆయన షర్టుపై స్వెటర్ వేసుకొని పియానో ప్లే చేస్తూ కనిపిస్తున్నారు. ఈ మూవీలో తమన్నా భాటియా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. జనవరి నుంచి జరిగే తదుపరి షెడ్యూల్ షూటింగ్లో ఆమె పాల్గొననున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమాను ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి హరి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు