అమెరికా వీసాల పేరుతో తెలుగు విద్యార్థులను బురిడీ..
- December 07, 2020
అమెరికా:అమెరికాలో H1 వీసాల పేరుతో తెలుగు విద్యార్థులను కిలాడీ జంట నట్టేట ముంచింది. అమెరికాలో చదువుకుంటున్న F1 వీసా కలిగి ఉన్న స్టూడెంట్స్ కి H1 వీసా లు ఇప్పిస్తానని ముత్యాల సునీల్, ప్రణీతలు కోట్లు వసూలు చేశారు. 30 మంది తెలుగు విద్యార్థుల దగ్గర 10 కోట్ల వరకు వసూళ్లు చేసినట్టు సమాచారం. ఒక్కో విద్యార్థి దగ్గర 25 వేల డాలర్లు వసూలు చేసినట్టు చెబుతున్నారు. దీంతో అట్లాంటా హోం ల్యాండ్ సెక్యూరిటీలో 30 మంది తెలుగు విద్యార్థులు వారి మీద ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో ముత్యాల సునీల్, ప్రణీత పైన ఇంటర్పోల్ నోటీసులు జారీ అయ్యాయి. అలానే ఇంటర్పోల్ ముత్యాల సునీల్ , ప్రణీత పైన లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతానికి సునీల్ , ప్రణీతలు పరారీలో ఉన్నారు. విద్యార్థుల దగ్గర వసూలు చేసిన డబ్బులను సునీల్ తండ్రి ముత్యాల సత్యనారాయణ ఎకౌంట్ కు బదిలీ చేసినట్టు గుర్తించారు ఇంటర్ పోల్ అధికారులు. ఈ డబ్బుతో సునీల్ తండ్రి ముత్యాల సత్యనారాయణ కోట్ల రూపాయల ఆస్తులు కూడ పెట్టినట్టు చెబుతున్నారు. సునీల్ , ప్రణీత యూరప్ పారిపోయినట్టు అనుమానాలు వ్యక్తం అవుతోండగా వెస్ట్ గోదావరి జిలాలో ఉండాల్సిన సునీల్ తండ్రి సత్యనారాయణ కూడా పరారీలో ఉన్నట్టు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష