పెరగనున్న చలిగాలుల ప్రభావం

- December 07, 2020 , by Maagulf
పెరగనున్న చలిగాలుల ప్రభావం

కువైట్ సిటీ:ఇటీవల కురిసిన వర్షాలు, దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ నీటి వనరులు నిండేందుకు ఆస్కారం కల్పించాయి. కాగా, రానున్న రోజుల్లో వాతావరణం మరింత చల్లబడనుంది ఈ వర్షాల కారణంగా. మిటియరోలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ మేరకు ముందస్తు వాతావరణ అంచనాల్ని విడుదల చేసింది. ఉదయం వేళల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా వుండనుంది. రాత్రి వేళల్లో కూడా చలిగాలులు ఎక్కువగానే వుంటాయి. సాధారణ నుంచి ఓ మోస్తరు వేగంతో ఈ చలిగాలులు వీస్తాయి. మిటియరాలజిస్ట్‌ మొహమ్మద్‌ కరమ్‌ మాట్లాడుతూ, రానున్న 10 రోజుల్లో చలి తీవ్రత గణనీయంగా పెరుగుతుందనీ, అది జనవరి సెకెండాఫ్‌ వరకూ కొనసాగుతుందని చెప్పారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com