కువైట్:నివాస అనుమతులు ఉల్లంఘించిన 8000 మంది ప్రవాసీయుల పిల్లలు
- December 07, 2020
కువైట్ సిటీ:కువైట్ లో ప్రవాసీయుల పిల్లలు 8000 మంది నివాస అనుమతుల నిబంధనలు ఉల్లంఘించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నివాస అనుమతికి చెల్లించాల్సిన డబ్బులు, ఆరోగ్య బీమా డబ్బులు తప్పించుకునేందుకు...పలువురు ప్రవాసీయులు తమ పిల్లల సంఖ్య నమోదు చేయకపోవటమే ఇందుకు కారణమని వివరించింది. అయితే...ఐదేళ్ల తర్వాత వారిని స్కూళ్లలో చేర్పించేందుకు వారి పిల్లల తల్లిదండ్రులు లీగల్ స్టేటస్ మార్చుకునేందుకు ప్రయత్నించటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇలా దాదాపు 8000 మంది పిల్లలు ఉన్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ గుర్తించింది. అయితే..ఇన్నాళ్లు తమ సంతానం విషయాన్ని ఎందుకు గుట్టుగా ఉంచారు..అంతర్గత మంత్రిత్వ శాఖ దగ్గర ఎందుకు నమోదు చేసుకోలేదని అధికారులు ఆరా తీశారు. అయితే...నివాస అనుమతులు, హెల్త్ ఇన్సూరెన్స్ కు డబ్బులు లేకపోవటంతోనే తమ పిల్లల సంఖ్య ఇన్నాళ్లుగా నమోదు చేయలేదని ప్రవాసీయులు వాపోయారు. అయితే..అలాంటి వాళ్లంతా ప్రస్తుతం కువైట్ ప్రభుత్వం అమలు చేస్తున్న క్షమాభిక్ష పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, డిసెంబర్ 1 నుంచి 31లోగా రెసిడెన్సీ స్టేటస్ మార్చుకోవాలని అంతర్గత మంత్రిత్వ శాఖ సూచించింది. ఇదిలాఉంటే..నవజాత శిశువుల సంఖ్య నమోదు ప్రక్రియను పూర్తి చేసేందుకు వారి గార్డియన్ కు నాలుగు నెలల గడువును ఇస్తూ ఇటీవలె ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. నాలుగు నెలల్లోగా సంఖ్య నమోదు చేయకపోతే గడువు తర్వాత ప్రతి రోజుకు KD4 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే...జరిమానా మొత్తం గరిష్టంగా KD600కి మించకూడదని కూడా అంతర్గత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.నివాస అనుమతి ఉల్లంఘన గడువు ఎన్ని రోజులైనా గరిష్టంగా KD600 వరికే జరిమానా విధిస్తారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు