ఆన్‌లైన్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలకు జైలు, 20,000 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా

- December 07, 2020 , by Maagulf
ఆన్‌లైన్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలకు జైలు, 20,000 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా

మనామా:బహ్రెయిన్‌ పార్లమెంట్‌ కమిటీ, ఆన్‌లైన్‌ వేదికగా ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించేలా చేసే అభ్యంతకర వ్యాఖ్యలు, ఆరోపణల్ని నేరపూరితంగా పరిగణించే డ్రాఫ్ట్‌ బిల్లుని ఆమోదించడం జరిగింది. ఫారిన్‌ ఎఫైర్స్‌, డిఫెన్స్‌ మరియు నేషనల్‌ సెక్యూరిటీ ఈ మేరకు కఠినమైన పెనాల్టీలను ప్రతిపాదించడం జరిగింది. ప్యానెల్‌ రికమండేషన్స్‌ని బట్టి చూస్తే, ఆన్‌లైన్‌ ద్వారా అభ్యంతకర ఆరోపణలు చేసేవారికి జైలు శిక్ష అలాగే అత్యధికంగా 20,000 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా విధించనున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లు, బహ్రెయిన్‌ చట్టం నెంబర్‌ 60 - 2014కి అదనంగా చేర్చబడుతుంది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగానికి సంబంధించిన చట్టంగా దీన్ని పరిగణిస్తారు. కింగ్‌డమ్‌ లెజిస్లేచర్‌ దీన్ని ఆమోదించాల్సి వుంటుంది.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com