కువైట్ నుంచి దుబాయ్ వెళ్ళేవారికి కోవిడ్ 19 టెస్ట్ అవసరంలేదు
- December 07, 2020
కువైట్ సిటీ:కువైట్ నుంచి దుబాయ్‌కి వెళ్ళే ప్రయాణీకులకు ఇకపై తప్పనిసరి కోవిడ్ 19 టెస్ట్ అవసరం లేదు. దుబాయ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. డిసెంబర్ 6 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. జిసిసి దేశాల నుంచి వచ్చేవారికి పిసిఆర్ టెస్ట్ అవసరం లేదని ఈ మేరకు ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ ట్రావెల్ అప్‌డేట్‌ని ఎమిరేట్స్ అలాగే ఫ్లై దుబాయ్ వెబ్‌సైట్లలో పోస్ట్ చేయడం జరిగింది. ప్రయాణీకులు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర కోవిడ్ టెస్ట్ చేయించుకోవచ్చు. కాగా, ఈ వెసులుబాటు ల్యాండ్ బోర్డర్ల ద్వారా వచ్చేవారికి వర్తించదు. హట్టా బోర్డర్ ద్వారా వచ్చేవారు 96 గంటల ముందుగా తీసుకున్న పీసీఆర్ టెస్ట్ సర్టిఫికెట్ తీసుకురావాల్సి వుంటుంది. కాగా, ప్రయాణీకులు కోవిడ్ 19 పాజిటివ్ వస్తే, అలాంటివారికి 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్‌షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్‌నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









