భారత్ బంద్ పై ప్రధాని మోదీ ఆస్తికర వ్యాఖ్యలు..
- December 07, 2020
న్యూ ఢిల్లీ:భారత కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఐదు సార్లు విఫలం కావడంతో.. భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు.. ఇక, రేపు జరగనున్న భారత్ బంద్‌కు బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు మద్దతు ప్రకటిస్తూనే ఉన్నాయి.. దేశ్యాప్తంగా వివిధ ప్రజాసంఘాలు, ప్రముఖులు సైతం మద్దతు తెలుపుతూనే ఉన్నారు.. అయితే, భారత్ బంద్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.. ఆగ్రా మెట్రో రాయ్ ప్రాజెక్ట్‌ను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పాత చట్టాలతో కొత్త శతాబ్దాన్ని నిర్మించలేమని వ్యాఖ్యానించారు. అభివృద్ధి జరగాలంటే సంస్కరణలు ఎంతో అవసరమన్న ఆయన.. శతాబ్దాల కింద చేసిన చట్టాలు ప్రస్తుతం భారంగా మారాయని పేర్కొన్నారు. కేంద్ర సర్కార్ తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేయడంతో.. భారత్ బంద్ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
దేశం అభివృద్ధి చెందాలంటే సంస్కరణలు అత్యావశ్యకం అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.. నూతన సౌకర్యాలు కల్పించాలన్నా, కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా... సంస్కరణలు అవసరమన్న ఆయన.. గత శతాబ్దపు చట్టాలతో నూతన శతాబ్దాన్ని నిర్మించలేం అని వ్యాఖ్యానించారు. సంస్కరణలనేవి నిరంతరాయంగా జరిగే ప్రక్రియ... గత శతాబ్దంలో కొన్ని చట్టాలు ఉపయోగంలో ఉండేవి.. కానీ, ఈ శతాబ్దానికి అవి భారంగా మారాయని పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇక, గతంలో సంస్కరణలు కొన్ని రంగాలకే పరిమితం అయ్యావి.. కానీ, తమ సర్కార్ మాత్రం అన్ని రంగాల్లో సంస్కరణలను విస్తరించినట్టు చెప్పుకొచ్చారు భారత ప్రధాని.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









