బహ్రెయినీ మహిళలకు అనుకూలంగా కొత్త చట్టం
- February 19, 2016
విదేశీయుల్ని పెళ్ళి చేసుకునే బహ్రెయినీ మహిళలు, తమ పిల్లలకు బహ్రెయినీ పౌరసత్వం కల్పించుకునేందుకు వీలుగా కొత్త చట్టాన్ని తీసుకురానున్నారు. పార్లమెంటులోని విమెన్ అండ్ చైల్డ్ కమిటీ ఛైర్‌పర్సన్, ఎంపీ రౌవా అల్ హయాకీ మాట్లాడుతూ, దీనికి సంబంధించిన చట్టం రూపకల్పన దశలో ఉందని చెప్పారు. పార్లమెంటులో జరిగిన బహ్రెయిన్ విమెన్స్ యూనియన్‌తో ప్రత్యేక సమావేశం అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారామె. బహ్రెయిన్ తల్లికి లేదా, బహ్రెయిన్ తండ్రికి బహ్రెయిన్‌లో లేదా ఇతర దేశంలో జన్మించిన బిడ్డకు బహ్రెయిన్ నేషనాలిటీ పొందే అవకాశం అతి త్వరలో రానుంది. మూడు నెలల్లో ఈ చట్టం అమల్లోకి వచ్చే అవకాశముందని ఆమె చెప్పారు. చట్టం రూపొందాక, అది అమలు తేదీ నుంచే అందుబాటులోకి వస్తుందన్నారు. అయితే, ఇంతకు ముందు కూడా ఇలాంటి జననాలకు సంబంధించి వివాదాలు ఉండటంతో, అలాంటి వివాదాలపై చర్చించి, పరిష్కారం చూపే అవకాశం కూడా ఉందన్నారు అల్ హాయికి.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







