ఆందోళనకరంగా దిలీప్ కుమార్ ఆరోగ్యం

- December 08, 2020 , by Maagulf
ఆందోళనకరంగా దిలీప్ కుమార్ ఆరోగ్యం

బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ విషయాన్ని స్యయంగా ఆయన భార్య సైరా భాను మీడియాకు తెలియచేసారు. కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఇప్పడు మరింత విషమించిందని తెలుస్తుంది. కొన్ని రోజుల కింద ఆయన కరోనా బారిన పడ్డారు. అప్పట్నుంచి ఈయన బాడీలో ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పడిపోయిందని సైరా భాను తెలిపారు. కనీసం తన ఇంట్లో ఒక గది నుంచి మరో గదికి కూడా నడవలేకపోతున్నాడంటూ చెప్పుకొచ్చింది సైరా భాను. దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ఆయన అభిమానులు కంగారు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన పక్కన ఉండటం.. ఆయన స్పర్శ తనకు కలగడం నిజంగానే అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది సైరా భాను.

54 ఏళ్ల కింద ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 1966లో సైరా భానును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు దిలీప్ కుమార్. ఈ మధ్యే తమ పెళ్లి రోజు జరుపుకోవాలని అనుకున్నా కూడా దిలీప్ సోదరులు ఇద్దరూ కరోనాతో చనిపోవడంతో వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు దిలీప్ కుమార్ ఆరోగ్యం కూడా అత్యంత విషమంగా ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగాలేదంటూ ఎమోషనల్ అయిపోయింది సైరా భాను. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నారు. బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఎన్నో వందల సినిమాలు చేసిన దిలీప్ కుమార్.. కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉన్నారు.

కరోనాతో దిలీప్ సోదరులు ఎహసాన్ భాయ్, అస్లాం భాయ్ ఈ మధ్యే చనిపోయారు. వాళ్లిద్దరంటే దిలీప్‌కు చాలా యిష్టం. అలాంటి వాళ్లు చనిపోవడంతో దిలీప్ డిప్రెషన్‌లోనే ఉన్నాడు. అప్పట్నుంచి ఇప్పటి వరకు అలాగే ఉండిపోయాడు దిలీప్ కుమార్. ఈ మధ్యే తనకు కరోనా వచ్చిందని తెలిసిన తర్వాత కరోనా బాధితులకు సేవ చేయాలని.. వాళ్లకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తగినంత ఆర్థికసాయం చేయాలని కోరాడు దిలీప్ కుమార్. ఇప్పుడు కరోనా నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. ప్రస్తుతం ఈయన వయసు 97 ఏళ్లు. 1922లో జన్మించారు దిలీప్ కుమార్. ఈయన ఆరోగ్యం కుదుటపడాలని దేశవ్యాప్తంగా అభిమానులు గుళ్లలో పూజాలు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com