యూఏఈ, సౌదీ లో మొట్టమొదటిసారిగా పర్యటించనున్న భారత్ సైన్యాధిపతి
- December 08, 2020
న్యూఢిల్లీ : భారత సైన్యం చీఫ్ జనరల్ ఎంఎం నరవనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియా పర్యటనకు మంగళవారం బయల్దేరారు. డిసెంబరు 9 నుంచి 14 వరకు జరిగే ఈ పర్యటనలో ఈ దేశాల సైనిక ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతారు. భారత సైన్యం అధిపతి ఈ దేశాల్లో పర్యటించడం ఇదే తొలిసారి.
జనరల్ నరవనే ఈ నెల 9 నుంచి 10 వరకు యూఏఈలో పర్యటిస్తారు. భారత్-యూఏఈ మధ్య రక్షణ రంగంలో సంబంధాలను పెంచుకోవడానికి ఉన్న అవకాశాలపై చర్చలు జరుపుతారు. ఈ నెల 13, 14 తేదీల్లో సౌదీ అరేబియాలో పర్యటిస్తారు. భారత్-సౌదీ అరేబియా మధ్య రక్షణ సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవడంపై చర్చిస్తారు. రక్షణ సంబంధ అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు. రాయల్ సౌదీ ల్యాండ్ ఫోర్స్ ప్రధాన కార్యాలయం, జాయింట్ ఫోర్స్ కమాండ్ ప్రధాన కార్యాలయం, కింగ్ అబ్దులజీజ్ వార్ కాలేజ్లను సందర్శిస్తారు. నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష