మరో మూడు దేశాల్లో వీసా కేంద్రాలను ఏర్పాటు చేయనున్న ఖతార్

- December 08, 2020 , by Maagulf
మరో మూడు దేశాల్లో వీసా కేంద్రాలను ఏర్పాటు చేయనున్న ఖతార్

దోహా:మరో మూడు దేశాల్లో వీసా జారీ కేంద్రాలను ప్రారంభించబోతున్నట్లు ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నేపాల్, పాకిస్తాన్, పిలిప్పెన్స్ లలో ఈ నెలలోనే వీసా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించింది. నేపాల్ రాజధాని ఖాడ్మాండులో డిసెంబర్ 10న, ఇస్లామాబాద్(పాకిస్తాన్)లో ఈ నెల 14న, మనీలా(పిలిఫ్పెన్స్) ఈ నెల 15న వీసా కేంద్రాలను ప్రారంభిస్తామని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఖతార్ వీసా సెంటర్ వెబ్ సైట్ ద్వారా ఈ మూడు దేశాల్లో ఇప్పటికే వీసా అపాయింట్మెంట్ బుకింగ్స్ కూడా మొదలైనట్లు వివరించింది. ఇదిలాఉంటే..గత వారమే భారత్ లో కూడా వీసా సెంటర్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com