బిగ్ బాస్4: విన్నర్ - రన్నర్ వారి మధ్యనే ఉండనుందా?

- December 09, 2020 , by Maagulf
బిగ్ బాస్4: విన్నర్ - రన్నర్ వారి మధ్యనే ఉండనుందా?

బిస్ బాస్ సీజన్ ఫోర్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సరిగ్గా మరో పది రోజుల్లో గ్రాండ్ ఫినాలేకి రంగం సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే ఇప్పటికి 93 రోజులుగా బిగ్ బాస్ రన్ అవుతోంది. అతి పెద్ద రియాలిటీ షోగా అందరినీ అలరిస్తోంది. ఇక బిగ్ బాస్ షోలో ఇపుడు ఆరుగురు కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు.

వారు బాగా ఆడుతున్నారు. అందులో ఈ చివరి వారం నామినేషన్స్ లో ఉన్నవారు అయితే కసిగా ఆడుతున్నారు. ఒక్కసారిగా ఆరియానా దూసుకువచ్చేసింది. ఆమె దూకుడు ఎలా ఉందంటే టాప్ ఫైవ్ లోకి కాదు అయితే విన్నర్ లేకపోతే రన్నర్ అన్నట్లుగా ఆరియానా గేమ్ అదరగొడుతోంది. ఆరియానా గేమ్ తో మిగిలిన కంటెస్టెంట్లు తేలిపోతున్నారు.

ఆరియానా నేనే రాజు టాస్క్ లో బెస్ట్ పెర్ఫార్మెర్ గాందరి లోనూ ప్రశంసలు అందుకుంది. ఆమెకు ఆడియన్స్ ని ఓటింగు కోసం రిక్వెస్ట్ చేసుకునే చాన్స్ అలా బిగ్ బాస్ ఇచ్చాడు. దానిని కూడా ఆమె పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. ఇక బిగ్ బాస్ లో ఆరియానా వేగానికి తట్టుకోవడం దేత్తడి హారిక వల్ల కూడా కావడం లేదు. ఆమెతో హారిక సైతం పోటీ పడలేకపోతోంది.

అదే సమయంలో మోనల్ కూడా గేమ్ ఆడలేక తేలిపోతోంది. ఇక ఈ అందరి కంటే ముందే టికెట్ టూ ఫినాలే ద్వారా టాప్ ఫైవ్ లోకి వెళ్ళిన అఖిల్ ఆ తరువాత ఒక్కసారిగా గ్రాఫ్ తగ్గించేశారు. సోహెల్ బాగా ఆడుతున్నా అతని కోపం మైనస్ అవుతోంది. ఆయన ఆరియానా మీదనే గట్టిగా అరవడం చేస్తున్నాడు. దాంతో అది అతని గ్రాఫ్ ని తగ్గిస్తుంది అంటున్నారు. ఇక కూల్ గా మైండ్ గేం తో ఆడుతున్న అభిజిత్ కి బయట బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉంది. దాంతో విన్నర్ రన్నర్ అన్నది ఆరియానా, అభిజిత్ ల మధ్యనే ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com