ఇజ్రాయిల్:తొలి వాక్సిన్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ కే...
- December 09, 2020
ఇజ్రాయిల్:కరోనా వైరస్ ప్రపంచాన్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నది.ఇప్పటికే కోట్లాది మంది కరోనా బారిన పడ్డారు.లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. అయితే, ఫైజర్ కంపెనీ తయారు చేసిన వాక్సిన్ కు అత్యవసర అనుమతులు మంజూరు చేస్తున్నాయి అనేక దేశాలు. 80 లక్షల డోసుల ఫైజర్ వాక్సిన్ కోసం ఇజ్రాయిల్ ప్రభుత్వం ఫైజర్ సంస్థతో ఒప్పందం చేసుకుంది.ఇందులో భాగంగా మొదటగా ఫైజర్ సంస్థ లక్ష డోసులను పంపించింది. తొలివిడతగా ఇజ్రాయిల్ చేరుకున్న ఆర్డర్ ను రిసీవ్ చేసుకోవడానికి ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.అక్కడ మీడియాతో మాట్లాడారు.ఫైజర్ సంస్థ వాక్సిన్ కు అత్యవసర అనుమతులు ఇంకా మంజూరు కాలేదు.త్వరలోనే అనుమతులు మంజూరు అవుతాయని, అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు కాగానే మొదటి వాక్సిన్ను తానే వేయించుకుంటానని ప్రధాని పేర్కొన్నారు.దీంతో పాటు అమెరికాకు చెందిన మోడెర్నా సంస్థ తయారు చేసిన వాక్సిన్లను ఇజ్రాయిల్ ఆర్డర్ చేసింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు