మొత్తానికి బ్రేకప్ చెప్పేసి వ్యాపారవేత్తను పెళ్లాడనున్న విశాల్ ప్రేయసి

- December 10, 2020 , by Maagulf
మొత్తానికి బ్రేకప్ చెప్పేసి వ్యాపారవేత్తను పెళ్లాడనున్న విశాల్ ప్రేయసి

తమిళ సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో విశాల్ ఒకడు. సినిమా పరంగానే కాకుండా సమాజంలో జరిగే ఎన్నో విషయాలపై తన స్పందనను అందిస్తూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాడీ హీరో. తన ప్రతి సినిమానూ తెలుగులో కూడా విడుదల చేస్తూ.. తమిళంతో పాటు మన దగ్గరా మంచి మార్కెట్‌ను సంపాదించుకున్నాడు. అదే సమయంలో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు. సినిమాల పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం అంతగా సక్సెస్ కాలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడి గురించి మరో న్యూస్ లీకైంది.

విశాల్ ఆ మధ్య హైదరాబాద్‌కు చెందిన అనీషా రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల సమక్షంలో జరిగిన ఈ వేడుక రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయింది. ఇది జరిగి చాలా రోజులు కావొస్తున్నా.. వీళ్లిద్దరి పెళ్లి గురించి మాత్రం అప్‌డేట్ రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అనీషా రెడ్డి.. తాజాగా మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమైందని తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో ఆమె నిశ్చితార్థం కూడా అయిపోయిందని అంటున్నారు. విశాల్‌తో పెళ్లి రద్దు అవడం వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని ప్రచారం జరుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com