పేదింటి అభిమాని కుమార్తె పెళ్ళికి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించిన చిరంజీవి
- December 10, 2020
తెలంగాణ:మహబూబాబాద్ పట్టణానికి కి చెందిన బోనగిరి శేఖర్ మిర్చి బండి తో జీవనాన్ని సాగిస్తూ గత 30 సంవత్సరాల నుండి మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమానిగా, రాష్ట్రస్థాయి చిరంజీవి సేవా కార్యక్రమాలను సక్సెస్ చేయడంలో శేఖర్ ముందు వరుసలో ఉంటాడు. శేఖర్ కీ ఇద్దరు కూతుళ్ళు వర్ష, నిఖిత. వీళ్ళ పేదరికాన్ని స్వయంగా చిరంజీవి తెలుసుకొని వాళ్ళ పెద్దమ్మాయి( వర్ష) ఈ నెల డిసెంబర్ 19 న జరిగే పెళ్లికి 1,00,000/- ఆర్ధిక సాయం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతు మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయల సహాయం చేయడం సంతోష కరమైన విషయం అని , చిరంజీవి ని ఆ దేవుడు చల్లగా చూడాలని ఎమ్మెల్యే అన్నారు, రవణం స్వామినాయుడు మాట్లాడుతూ అభిమానులు ఎవరూ కష్టాల్లో ఉన్న మాకు చెప్పండి అని చిరంజీవి స్వయంగా మాతో చెప్పినట్టు స్వామి నాయుడు చెప్పారు, నగదు సహాయం అందుకున్న చిరంజీవి అభిమాని శేఖర్ మాట్లాడుతూ "రక్త సంబంధీకులు చేయని సహాయం చిరు చేసారు ఏమిచ్చినా ఈ రుణం తీర్చుకోలేనిది అని కన్నీళ్ల పర్యంతమయ్యారు .ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ సీఈఓ రవణం రావణస్వామి నాయుడు ,సంతోషం పత్రిక అధిపతి సురేశ్ కొండేటి, అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు కె. ప్రభాకర్ గౌడ్, స్ధానిక మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, మహబూబాబాద్ చిరంజీవి యువత అధ్యక్షులు మునిర్, స్థానిక చిరంజీవి అభిమాన సంఘం నాయకులు పెద్ద ఎతున్న పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







