'తిమ్మరుసు'.... టీజర్‌ను విడుదల చేసిన డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్
- December 10, 2020
హైదరాబాద్:"కేసు గెలిచామా? ఓడామా? అనేది కాదు ఇంపార్టెంట్. సంపాదన ఎంతనేదే ఇంపార్టెంట్...అని ఓ వ్యక్తి హీరో సత్యదేవ్‌ను ఉద్దేశించి అడిగితే తను మాత్రం "నాకు మాత్రం న్యాయం గెలవడం మాత్రమే ఇంపార్టెంట్ సార్" అని అంటాడు. అంటే హీరో న్యాయం గెలవడానికి ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తి అని అర్థమవుతుంది. అలాగే సత్యదేవ్ లాయర్ పాత్రలో కనిపిస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకున్న సత్యదేవ్..మరోసారి డిఫరెంట్‌గా లాయర్ పాత్రలో మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. ఇంతకీ సత్యదేవ్ న్యాయాన్ని గెలిపించడానికి ఏం చేశాడు? అనేది తెలుసుకోవాలంటే 'తిమ్మరుసు' సినిమా చూడాల్సిందేనని అంటున్నారు దర్శక నిర్మాతలు.
విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్న సత్యదేవ్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'తిమ్మరుసు'. 'అసైన్మెంట్ వాలి' ట్యాగ్‌లైన్. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్ కోనేరు తో పాటు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్‌పై శృజన్ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా టీజర్‌ను డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ విడుదల చేసి సినిమా మంచి సక్సెస్ కావాలని చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా...
నిర్మాతలు మాట్లాడుతూ - "'తిమ్మరుసు' టీజర్‌ను విడుదల చేసిన స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఆసక్తికరమైన టీజర్ ద్వారా తెలియజేశాం. సత్యదేవ్ ఒక డేరింగ్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన లుక్, క్యారెక్టర్ డిజైనింగ్ చాలా కొత్తగా ఉంటుంది. డైరెక్టర్ శరణ్ కొపిశెట్టి, పక్కా ప్లానింగ్‌తో సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. సినిమా దాదాపు పూర్తయ్యింది. వచ్చే నెల సినిమాను ప్రేక్షకులను ముందుకు తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నాం" అన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు