ఢిల్లీకి బయల్దేరిన సిఎం కెసిఆర్
- December 11, 2020
హైదరాబాద్: సిఎం కెసిఆర్ ఢిల్లీకి బయల్దేరారు. ఆయన షెడ్యూల్ కు సంబంధించి పూర్తి క్లారిటీ లేనప్పటికీ… రెండు, మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీ పర్యటన కొనసాగే అవకాశాలు ఉన్నాయి. పంటి చికిత్స కోసం ఢిల్లీలోని ఓ ప్రముఖ డెంటిస్ట్ ను ఆయన కలవనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం కేటాయించిన స్థలంలో ఆయన భూమి పూజ చేసే అవకాశాలు ఉన్నాయి. తన పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు ఇతర కేబినెట్ మంత్రులను ఆయన కలిసే అవకాశం ఉంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై వారితో చర్చలు జరపనున్నాయి. మరోవైపు, ప్రధాని మోడి అపాయింట్ మెంట్ ను కెసిఆర్ కోరలేదని సమాచారం. దీంతో, మోడితో కెసిఆర్ భేటీ అయ్యే అవకాశాలు లేవనే తెలుస్తోంది.
మరో ఆసక్తికర విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న కెసిఆర్… రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ కు కూ పూర్తి మద్దతు పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ శ్రేణులన్నీ బంద్ లో పాల్గొన్నాయి. దీంతో, ఢిల్లీ శివార్లలో మకాం వేసిన రైతులను ఆయన కలుస్తారా? అనే చర్చ కూడా జరుగుతోంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష